IPL 2021: రవీంద్ర జడేజా అసలైన టీ20 క్రికెటర్‌: వాన్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అసలుసిసలైన టీ20 క్రికెటర్‌ అని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఈ చెన్నై ఆల్‌రౌండర్‌ పరిస్థితులకు తగ్గట్టు...

Published : 05 Oct 2021 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అసలుసిసలైన టీ20 క్రికెటర్‌ అని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ మెచ్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఈ చెన్నై ఆల్‌రౌండర్‌ పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా వాన్ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించాడు.

‘జడేజా అద్భుతమైన ఆటగాడు. అన్ని విభాగాల్లో రాణిస్తాడు. ఫీల్డింగ్‌లో తనదైన విన్యాసాలతో ఆకట్టుకుంటూనే ఎడమచేతి వాటంతో స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు. పిచ్‌ అనుకూలిస్తే వికెట్లు తీసి ప్రత్యర్థిని తిప్పలు పెడతాడు. ఇక అతడి బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి స్థితిలోనైనా పరుగులు రాబట్టగలడు. తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయగలడు. అతడు అసలుసిసలైన టీ20 క్రికెటర్‌. ఎవరైనా ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను తయారు చేయాలంటే క్రిస్‌గేల్‌ లేదా కోహ్లీని ఆదర్శంగా చూపిస్తారు. కానీ, మంచి టీ20 క్రికెటర్‌ను తయారు చేయాలంటే మాత్రం జడేజానే సరైన ఉదాహరణ’ అని వాన్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని