RCB Vs SRH:ఊపుమీదున్న ఆర్సీబీ.. సన్‌రైజర్స్ తీరు ఇకనైనా మారేనా?
ఐపీఎల్-14 సీజన్లో మరో బుధవారం రాత్రి మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పరాజయాల పరంపర కొనసాగిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. 12 మ్యాచ్‌లు
(Photo: RCB Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-14 సీజన్లో బుధవారం రాత్రి మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పరాజయాల పరంపర కొనసాగిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలతో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఖరారు చేసుకోగా.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తూ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి చాలా రోజుల క్రితమే నిష్క్రమించింది. ఈ రెండు జట్లలో పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకుందాం.
హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న కోహ్లి సేన..
ఈ సీజన్ తొలి దశ నుంచే ఆర్సీబీ మెరుగ్గా ఆడుతోంది. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. మొదట నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైంది. రెండో దశలో కోల్‌కతా, చెన్నై చేతిలో కంగుతిన్న ఆర్సీబీ.. తర్వాత పుంజుకుంది. బలమైన ముంబయి ఇండియన్స్ జట్టును 54 పరుగులతో ఓడించింది. అనంతరం రాజస్థాన్, పంజాబ్ కింగ్స్‌పై కూడా నెగ్గి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి ప్లే ఆఫ్స్‌ని ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవాలని భావిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ నిలకడగా పరుగులు చేస్తున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ నుంచి ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్ రాలేదు. ఇదొక్కటే ఆందోళన కలిగించే విషయం. బౌలింగ్‌లో హర్షపటేల్ అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక వికెట్లు (26) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్ గాడిలో పడ్డట్టు కనిపిస్తున్నాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్‌లో ఈ జట్టు ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్లే ఆఫ్స్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్..ఇకనైనా గెలుపు బాట పట్టేనా?
ఈ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్సే. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్..పంజాబ్ కింగ్స్ జట్టుపై మాత్రమే విజయం సాధించింది. రెండో దశలో పుంజుకుంటుందనుకుంటే భావించినా.. పరిస్థితి మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ దశలో నాలుగు మ్యాచ్‌లో ఆడిన ఎస్ఆర్హెచ్.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం. ఏ ఒక్క బ్యాటర్ కూడా నిలకడగా పరుగులు చేయడం లేదు. విలియమ్సన్,సాహా, అబ్దుల్ సమద్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ ఇలా ఏ ఆటగాడిని తీసుకున్న నిలకడగా పరుగులు చేయడం లేదు. బౌలింగ్‌లో రషీద్‌ఖాన్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్ ప్రభావం చూపలేకపోతున్నారు. మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనైనా బ్యాటింగ్, బౌలింగ్‌లో లోపాలను సరిచేసుకుని టోర్నీని విజయాలతో ముగిస్తుందేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్‌లో అత్యుత్తమ కోచ్‌ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్‌పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్