CSK:ధోనీ కన్నా ముందు అతడు బ్యాటింగ్ చేయాలి:మంజ్రేకర్‌

మరికొన్ని గంటల్లో ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశ ఆరంభంకానుంది. ఈ రోజు సాయంత్రం దుబాయ్‌ వేదికగా  రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్‌, ఎం.ఎస్‌.ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) మధ్య జట్ల మధ్య జరగనుంది. రెండు బలమైన జట్లే కావడంతో

Updated : 19 Sep 2021 18:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశ ఆరంభంకానుంది. ఈ రోజు సాయంత్రం దుబాయ్‌ వేదికగా  రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్‌, ఎం.ఎస్‌.ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే)  జట్ల మధ్య జరగనుంది. రెండు బలమైన జట్లే కావడంతో ఏ జట్టు విజేతగా నిలుస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  తొలి దశ ఐపీఎల్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయగా.. కెప్టెన్‌ ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. యూఏఈలో ఆడనున్న మిగతా మ్యాచ్‌ల్లోనూ సీఎస్కే ఇదే విధానాన్ని అనుసరించాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ సూచించాడు.

‘జడేజా.. ధోనీ కంటే ముందు బ్యాటింగ్‌ చేయాలి. ఈ సీజన్‌లో సీఎస్కే బాగా ఆడుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ జట్టు ఆటతీరు మారిపోయింది. భారత్‌లో జరిగిన తొలి దశ ఐపీఎల్‌లో మొయిన్ అలీ, సామ్‌ కరన్‌ మంచి ఆటతీరును కనబర్చారు. వారు యూఏఈలో అంతకన్నా బాగా ఆడాలి. ’ అని మంజ్రేకర్‌ అన్నాడు. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన జడేజా..131 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని