IPL: ఐదారు రోజులు గదిలోనే ఉండిపోయాం
బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు
ఇంటర్నెట్ డెస్క్: బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే కొంతమంది విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు పయనం కాగా, మరికొంతమంది క్వారంటైన్ నిబంధనల కారణంగా ఇంకా భారత్‌లోనే ఉన్నారు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ రెహ్మాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన షకీబ్ అల్ హసన్.. ఐపీఎల్ వాయిదా పడిన అనంతరం ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ చేరుకున్నారు. అయితే, కొన్ని నెలలుగా తాను న్యూజిలాండ్, భారత్‌లో ఐసోలేషన్, బయో బబుల్‌లో ఉండి మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ముస్తాఫిజుర్ మాట్లాడాడు.
‘నిరంతరం బయోబబుల్‌లో ఉండటం వల్ల తీవ్రమైన అలసట కలుగుతుంది. ఇది రోజురోజుకీ కష్టతరంగా మారేది. హోటల్ నుంచి మైదానానికి, మైదానం నుంచి హోటల్‌కి.. ఇదే దినచర్యగా మారితే మీరేలా ఉండగల్గుతారు. అది ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా కొవిడ్ నిబంధనలు అంతటా ఒకేలా ఉంటాయి. వీటిని పాటించడం ప్రతి ఒక్కరికీ కష్టంగానే ఉంటుంది. కానీ నేను ఏమీ చేయలేను. భారత్‌లో ఉన్నప్పుడు బయోబబుల్‌లో సురక్షితంగా ఉన్నాం. ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ చేరుకున్నాం. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నా. అయితే, ఒక జట్టులోని సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం మమ్మల్ని ఐదారురోజులపాటు ఒక గదిలోనే ఉంచారు’ అని ముస్తాఫిజుర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి