IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో భాగంగా దుబాయ్‌ వేదికగా నాలుగో మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్‌ రైజర్స్ హైదరబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఈ మ్యాచ్‌లో పోటీ..

Updated : 22 Sep 2021 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్కు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో భాగంగా దుబాయ్‌ వేదికగా నాలుగో మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దిల్లీ క్యాపిటల్స్ (డీసీ), సన్‌ రైజర్స్ హైదరబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఈ మ్యాచ్‌లో పోటీ పడనున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌ రైజర్స్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. ప్లే ఆఫ్స్‌ చేరుకోవాలంటే ప్రతి మ్యాచులో గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్‌ ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచులో గెలిచి.. ఆరింట్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరోవైపు, సన్‌ రైజర్స్ ఆటగాడు నటరాజన్‌ కరోనా బారిన పడటంతో.. అతడితో సన్నిహితంగా మెలిగిన మరి కొందరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. 

దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు..
పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టొయినిస్‌, షిమ్రోన్‌ హెట్మేయర్, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌

సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు..
డేవిడ్‌ వార్నర్‌, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మనీశ్‌ పాండే, జేసన్‌ హోల్డర్‌, అబ్ధుల్‌ సమద్‌, కేదార్‌ జాదవ్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని