IPL 2021: ఐపీఎల్ ఆడే అవకాశం రావడం నా అదృష్టం: స్టీవ్‌ స్మిత్‌

ఐపీఎల్‌-14సీజన్‌ ద్వితీయార్ధంలో తిరిగి ఆడే అవకాశం రావడం తన అదృష్టమని దిల్లీ క్యాపిటల్స్‌  ఆటగాడు స్టీవ్‌ స్మిత్ అన్నాడు. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో తమ జట్టుకు మరింత బాగా ఆడే సత్తా ఉందని   స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా నుంచి  దుబాయ్‌ చేరుకున్న స్టీవ్‌ స్మిత్‌ జట్టుతో కలిశాడు.

Published : 11 Sep 2021 02:17 IST

(Photo:Delhi Capitals Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-14సీజన్‌ ద్వితీయార్ధంలో తిరిగి ఆడే అవకాశం రావడం తన అదృష్టమని దిల్లీ క్యాపిటల్స్‌  ఆటగాడు స్టీవ్‌ స్మిత్ అన్నాడు. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో తమ జట్టుకు మరింత బాగా ఆడే సత్తా ఉందని  స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా నుంచి  దుబాయ్‌ చేరుకున్న స్టీవ్‌ స్మిత్‌ జట్టుతో కలిశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్-14 పునః ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. రిషభ్ పంత్‌ నాయకత్వం వహిస్తున్న దిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లో  టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

‘మేం చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాం. తద్వారా ఫలితాలను పొందుతున్నాం. టోర్నీ ముగింపు దశలో మేం మా అత్యుత్తమ క్రికెట్‌ను ఆడాలి. మరింత బాగా ఆడతామనే నమ్మకం నాకుంది. ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో ఆడాలి. అందరం కలిసి ఆడి చాలా నెలలు అవుతోంది. కాబట్టి తిరిగి జట్టును పునర్నిర్మించుకోవాలి. మా జట్టులో మంచి ఆటగాళ్లున్నారు’అని స్మిత్‌ అన్నాడు.

‘శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి జట్టులోకి వచ్చాడు. అది మాకు ఎంతో సానుకూలమైన అంశం. శ్రేయస్‌ అయ్యర్  నాణ్యమైన ఆటగాడు. అతడు జట్టులో చేరడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో గత 18 నెలల్లో ఇది చాలా ప్రత్యేకమైన సమయం. ఐపీఎల్ ద్వితీయార్ధం ఆడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఐపీఎల్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నా’ అని స్మిత్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని