IPL 2022 Auction: లివింగ్‌స్టోన్‌కు పెద్ద మొత్తం.. మోర్గాన్‌, మలన్‌, ఫించ్‌లకు నిరాశ

ఐపీఎల్‌ 2022 మెగా వేలం రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటివరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు...

Updated : 13 Feb 2022 21:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022 మెగా వేలం రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడిని పంజాబ్‌ కింగ్స్‌ రూ.11.50 కోట్లకు దక్కించుకొంది. మరోవైపు కీలక ఆటగాళ్లుగా పేరున్న ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ముంబయి ఇండియన్స్‌ లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సౌరభ్‌ తివారి, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ఫించ్‌, టీమ్‌ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారాలను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇక పంజాబ్‌.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. మిగతావారిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్కో జెన్‌సన్‌ను రూ.4.20 కోట్లకు తీసుకుంది. అలాగే టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై అత్యధిక ధర రూ.9.25 కోట్లకు కొనుగోలు చేయగా ఈసారి అతడి ధర అమాంతం పడిపోయింది. కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రూ.90లక్షలకే దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని