IPL 2022 Auction: మన కల నిజమైతే ఇలాంటి అద్భుతాలే చోటుచేసుకుంటాయి

ఏ క్రికెటర్‌కైనా ఐపీఎల్‌ లాంటి మెగా టోర్నీలో ఆడాలని ఉంటుంది. యువకుడిగా ఉన్నప్పుడే ఆ కల నెరవేరితే ఇక ఆ ఆటగాడి ఆనందానికి అవధుల్లేకుండా ఉంటాయి...

Updated : 15 Feb 2022 13:19 IST

(Photo: Tilak Varma Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ క్రికెటర్‌కైనా ఐపీఎల్‌ లాంటి మెగా టోర్నీలో ఆడాలని ఉంటుంది. యువకుడిగా ఉన్నప్పుడే ఆ కల నెరవేరితే ఇక ఆ ఆటగాడి ఆనందానికి అవధుల్లేకుండా ఉంటాయి. ఇక టోర్నీలో మంచి అవకాశాలు వచ్చి రాణిస్తే కెరీర్‌ రూపురేఖలే మారిపోతాయి. తాజాగా జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. అతడు కనీస ధర రూ.20లక్షలకు వేలం పోటీలో నిలవగా.. ముంబయి, సన్‌రైజర్స్‌ జట్లు పోటీపడ్డాయి. అయితే, రోహిత్‌ టీమ్‌ చివరికి 8 రెట్లు అధిక మొత్తానికి రూ.1.7 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో తిలక్‌ కూడా సంబరాల్లో మునిగితేలాడు. అలాగే వేలం జరిగేటప్పుడు అతడి స్నేహితులు కూడా పక్కనే ఉండటంతో ఆ సంబరాలు రెట్టింపయ్యాయి. దీంతో వారంతా తిలక్‌ను పట్టుకొని సంతోషంగా ఆటపట్టించారు. ఆ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా ముంబయి దాన్ని ట్వీట్‌ చేసి అభిమానులకు షేర్‌ చేసింది. ‘మీ కల నిజం అయినప్పుడు ఇలాంటి అద్భుతమైన క్షణాలే చోటుచేసుకుంటాయి’ అంటూ తిలక్‌ను ముంబయి కుటుంబంలోకి ఆహ్వానించింది. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని