IPL 2022: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులోభారత మాజీ కోచ్‌

ఐపీఎల్-15 సీజన్‌ మరికొన్ని నెలల్లో ప్రారంభంకానుండటంతో ఫ్రాంచైజీలు.. జట్టు కూర్పు, కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాయి. ఈ క్రమంలో మాజీ ఛాంపియన్‌, తాజా

Published : 14 Jan 2022 23:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్-15 సీజన్‌ మరికొన్ని నెలల్లో ప్రారంభంకానుండటంతో ఫ్రాంచైజీలు.. జట్టు కూర్పు, కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాయి. ఈ క్రమంలో మాజీ ఛాంపియన్‌, తాజా రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) కూడా జట్టులో పలు మార్పులకు ఉపక్రమించింది. వచ్చే సీజన్‌ కోసం కొత్త బౌలింగ్‌ కోచ్‌ని నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. టీమ్‌ఇండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కి ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ విషయాన్ని కేకేఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. భరత్‌ అరుణ్‌ మాట్లాడుతూ..కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తుంద‌న్నారు. కేకేఆర్‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నానని పేర్కొన్నారు. భరత్‌ అరుణ్‌ ఆరేళ్లపాటు భారత జట్టుతో కలిసి పనిచేశారు. ఆయన శిక్షణలోనే టీమ్‌ఇండియా పేస్‌ దళం పటిష్టంగా తయారైంది. అరుణ్‌కు గతంలో కూడా ఐపీఎల్‌లో బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2015 నుంచి 2017 వరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీకి బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశారు. ఐపీఎల్ 2022 కోసం వ‌చ్చే నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం జ‌ర‌గ‌నుందని ఇటీవ‌లే బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని