IPL 2022: మెగా టోర్నీకి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌!

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలేలా ఉంది! ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ వేలంలో రూ.14 కోట్ల రెండో అత్యధిక ధర పలికిన దీపక్‌ చాహర్‌...

Published : 25 Feb 2022 12:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలేలా ఉంది! ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచిన దీపక్‌ చాహర్‌(రూ.14 కోట్లు) .. ఆ జట్టులో కీలక ఆటగాడనే సంగతి తెలిసిందే. అయితే, గతవారం టీమ్‌ఇండియా తరఫున వెస్టిండీస్‌తో ఆడిన చివరి టీ20లో గాయపడిన అతడు తొలుత శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. కానీ, తాజా సమాచారం ప్రకారం చాహర్‌ కోలుకునేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఐపీఎల్‌ 2022 టోర్నీకి కూడా అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

మరోవైపు 2018 నుంచీ చెన్నై జట్టులో కొనసాగుతున్న దీపక్‌ చాహర్‌ పవర్‌ప్లేలో కీలక పేసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తొలి ఆరు ఓవర్లలోనే వికెట్లు సాధించి జట్టుకు శుభారంభాలు అందించడమే కాకుండా ఆదిలోనే ప్రత్యర్థులను దెబ్బకొట్టి తన వంతు పాత్ర పోషించాడు. దీంతో దీపక్‌.. ధోనీసేనలో ముఖ్యమైన ఆటగాడిగా నిలిచాడు. అయితే, ఈ ఏడాది మెగా వేలానికి ముందు రిటెన్షన్‌ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వదిలేసినా చివరికి వేలంలో తిరిగి దక్కించుకుంది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా, దీపక్‌ ఇటీవల బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో రాణించి లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్‌ ఝుళిపించగలడనే నమ్మకాన్ని ఆయా జట్లకు కలిగిస్తున్నాడు. అందువల్లే చెన్నై కూడా మరోసారి అతడిని దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని