IPL 2022: టాటా ఐపీఎల్ మెగా వేలం తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?

క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2022 మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఇప్పటికే ఈనెల 12, 13 తేదీల్లో బెంగళూరులో...

Updated : 08 Feb 2022 14:21 IST

(Photo: IPL Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌-2022 మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. అందరూ ఊహించినట్లే.. ఈనెల 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ మెగా వేలాన్ని నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఉదయం 11 నుంచి వేలం పాట జరుగుతుందని, స్టార్‌స్పోర్ట్స్‌, డిస్నీ ప్లస్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు తెలిపారు. ఐపీఎల్‌తో ప్రముఖ చైనా మొబైల్‌ సంస్థ వీవో ఒప్పందం ఈ ఏడాదితో ముగిసిపోవడంతో ఈసారి టాటా గ్రూప్‌ అధికారిక స్పాన్సర్‌షిప్‌ దక్కించుకుంది. దీంతో ఇకపై టాటా ఐపీఎల్‌గా దీన్ని వ్యవహరించనున్నారు.

మరోవైపు ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 590 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. అందులో 228 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, మరో 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లూ ఇందులో పాల్గొంటున్నారు. కాగా, ఈ ఏడాది రెండు కొత్త జట్లు చేరిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి అహ్మదాబాద్‌ టైటాన్స్ కాగా, రెండోది లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని