IPL 2023: ‘ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
ఐపీఎల్-16 (IPL 16) సీజన్‌లో టైటిల్‌ను అందుకునే జట్టేదో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis) అంచనా వేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-16 (IPL) సీజన్ వచ్చేసింది. శుక్రవారం (మార్చి 31) నుంచే ఈ మెగా టీ20 లీగ్ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో లీగ్‌కు తెరలేవనుంది. అయితే, ఇంకా మ్యాచ్‌లు మొదలవ్వకముందే ఈ సారి ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై విశ్లేషణలు వెలువడుతున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన అనుభవం ఉన్న జాక్వెస్ కలిస్ (Jacques Kallis) ఐపీఎల్-16లో టైటిల్‌ను అందుకునే జట్టేదో అంచనా వేశాడు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ జరుగుతుందని.. టైటిల్ పోరులో రోహిత్ సేనను ఓడించి దిల్లీ తొలిసారి ఛాంపియన్‌గా నిలుస్తుందని కలిస్ జోస్యం చెప్పాడు.
‘ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఏ జట్లు ఉండబోతున్నాయో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే జట్లు చాలా తీవ్రంగా పోటీపడి దాదాపు సమాన స్థితిలో నిలుస్తాయి. కానీ, ఈ సంవత్సరం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకుంటాయని అనిపిస్తోంది. ముంబయిని ఓడించి దిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధిస్తుందని భావిస్తున్నా’ అని జాక్వెస్ కలిస్ అన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్‌గా నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్ ఒక్కటంటే ఒక్కసారిగా కప్ గెలవలేకపోయింది. 2020లో రన్నరప్‌గా నిలవడమే ఆ జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం