IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
ఈ నెల 31 నుంచి ఐపిఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుండగా....హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్ లు జరగనున్నాయి. మ్యాచ్ జరిగే సమాయాల్లో భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సిపి డి.ఎస్. చౌహాన్ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో ఇక్కడ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 2న సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. దీంతో మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టు ప్రతినిధులు, బీసీసీఐ, హెచ్‌సీఏ ప్రతినిధులతో రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
‘ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పని తీరు, విధుల నిర్వహణను మరింత మెరుగుపరుచుకోవడానికి సిబ్బందికి ఇది మంచి అవకాశం. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు అందిస్తాం. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సమీక్షా సమావేశంలో అన్నారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం తలెత్తకుండా సన్ రైజర్స్ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అంతా...పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు.
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ల షెడ్యూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ
-
Manoj Manchu: మంచు మనోజ్ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!