రాగల 24 గంటల్లో ఐపీఎల్‌ పూర్తి షెడ్యూలు!

రాగల 24 గంటల్లో ఐపీఎల్‌-2020 పూర్తి షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ షేక్‌ నహ్‌యాన్‌ బిన్‌ముబారక్‌తో బీసీసీఐ సమావేశం ముగిసిందని తెలిసింది. అబుదాబి, దుబాయ్‌, షార్జాల మధ్య రాకపోకలు, నిబంధనల్లో సడలింపుల గురించి ఆయన హామీ ఇచ్చారని సమాచారం....

Published : 29 Aug 2020 01:04 IST

ఇంటర్‌నెట్ డెస్క్‌‌: రాగల 24 గంటల్లో ఐపీఎల్‌-2020 పూర్తి షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ షేక్‌ నహ్‌యాన్‌ బిన్‌ముబారక్‌తో బీసీసీఐ సమావేశం ముగిసిందని తెలిసింది. అబుదాబి, దుబాయ్‌, షార్జాల మధ్య రాకపోకలు, నిబంధనల్లో సడలింపుల గురించి ఆయన హామీ ఇచ్చారని సమాచారం.

కరోనా వైరస్‌తో వాయిదా పడిన ఐపీఎల్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు పూర్తి షెడ్యూల్‌ వెల్లడించలేదు. ఇప్పటికే ఫ్రాంచైజీలు అన్నీ యూఏఈ చేరుకున్నాయి. వారం రోజులు క్వారంటైన్‌ సైతం ముగిసింది.

అబుదాబిలో కేసులు ఎక్కువగా ఉండటంతో దుబాయ్‌, షార్జాతో పోలిస్తే కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. దుబాయ్‌, షార్జా నుంచి రావాలన్నా అబుదాబిలో టెస్టులు తప్పనిసరి. నెగటివ్‌ వస్తేనే ప్రవేశం లభిస్తుంది. లేదంటే కష్టం. ఐపీఎల్‌ జట్లు వెంటవెంటనే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆంక్షలుంటే కష్టమని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఈసీబీతో మంతనాలు జరిపింది. ఈసీబీ చీఫ్‌ షేక్‌ నహ్‌యన్‌ యూఏఈలో సాంస్కృతిక, యువత అభివృద్ధి  శాఖకు మంత్రి ప్రభుత్వంతో మాట్లాడి సడలింపులు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని