Umran Malik: ఏదో ఒక రోజు 155 Kmph వేగంతో సంధిస్తా: ఉమ్రాన్‌ మాలిక్‌

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉమ్రాన్‌ మాలిక్‌ పేరు వినిపిస్తోంది. వేగవంతమైన ...

Published : 29 Apr 2022 02:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉమ్రాన్‌ మాలిక్‌ పేరు వినిపిస్తోంది. వేగవంతమైన బౌలింగ్‌తోపాటు టీ20 లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా బుధవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగులకే ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇందులో నాలుగు బౌల్డ్‌లు కాగా.. ఒకటి క్యాచ్‌ ఔట్.  అదేవిధంగా 150 కి.మీ వేగంతో స్థిరంగా బంతులను సంధిస్తున్నాడు. ఇప్పటి వరకు టీ20 లీగ్‌లో 15 వికెట్లు తీశాడు. ‘‘లెంగ్త్‌తో బంతిని వేగంగా సంధించి వికెట్లను తీయడమే నా ప్రణాళిక. అందులో భాగంగానే హార్దిక్‌కు బౌన్సర్‌, సాహాకు యార్కర్‌ సంధించా. ఫాస్ట్‌కు తోడు వికెట్లను టార్గెట్‌ చేసేందుకు ప్రయత్నించా’’ అని ఉమ్రాన్‌ వివరించాడు. 

ఒకే ఇన్నింగ్స్‌లో అన్‌క్యాప్‌డ్‌ బౌలర్‌ ఐదు వికెట్లు తీయడం, ప్రత్యర్థి కోల్పోయిన అన్ని వికెట్లనూ ఒకే బౌలర్‌ పడగొట్టడం వంటి అరుదైన రికార్డులను ఉమ్రాన్‌ మాలిక్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్‌పై హైదరాబాద్‌ ఓడినప్పటికీ ఉమ్రాన్‌ ప్రదర్శన మాత్రం మరిచిపోలేనిది. ఈ మ్యాచ్‌లోనే 153 కి.మీ వేగంతో వేసిన బంతి వృద్ధిమాన్‌ సాహాను క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. 155 కి.మీ వేగంతో బంతిని ఎప్పుడు సంధిస్తావని అడిగిన ప్రశ్నకు ఉమ్రాన్‌ మాలిక్ సమాధానమిస్తూ.. ‘‘ప్రస్తుతానికి నా దృష్టంతా సరైన ప్రదేశంలో బంతిని సంధించి వికెట్లను సాధించడంపైనే ఉంది. అయితే దేవుడి సంకల్పిస్తే.. ఏదొక రోజు 155 కి.మీ వేగంతో బంతిని సంధిస్తా’’ అని స్పష్టం చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని