RCB: ఆర్‌సీబీ ట్విటర్ హ్యాక్‌.. ఖాతా పునరుద్ధరణ

ఐపీఎల్ (IPL)లో ఆర్‌సీబీ (RCB) ప్రత్యేకత వేరు. స్టార్లతో కూడిన ఫ్రాంచైజీ. కానీ ఒక్కసారి కప్‌ను అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలవడానికి కారణం హ్యాకింగ్‌. అవును ఆర్‌సీబీ ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది.

Published : 21 Jan 2023 15:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీల్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒకటి. విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ వంటి హేమాహేమీలు ఉన్నారు. అలాంటి ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తన ట్విటర్ హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. కాసేపటికి పునరుద్ధరణకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్విటర్‌ ఖాతాను ఓపెన్ చేయడానికి ఇవాళ కాసేపు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ డీపీ కూడా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆర్‌సీబీ ఖాతాకు సంబంధించిన బయోలో..  ‘‘సభ్యుడిగా కావడానికి, బోర్‌డ్‌ ఏపే లేదా ముటంట్‌ ఏపేని కొనుగోలు చేయండి. క్రియేటెడ్‌ బై యుగ ల్యాబ్స్‌’’ అని హ్యాకర్లు మార్పు చేశారు. ఇలా ఆర్‌సీబీ ట్విటర్ హ్యాక్‌కావడం ఇదే మొదటిసారి కాదు. 2021 సెప్టెంబర్‌లోనూ ఫ్రాంచైజీ ఖాతాను హ్యాక్‌ చేశారు. ఎట్టకేలకు ఖాతాను పునరుద్ధరించడంతో ఆర్‌సీబీ స్పందించింది. 

‘‘మా ట్విటర్ ఖాతా కొన్ని గంటల కిందట హ్యాకింగ్‌కు గురైంది. అయితే టెక్నికల్‌ సిబ్బంది ప్రయత్నంతో సమస్యను పరిష్కరించాం. హ్యాకర్లు పెట్టిన ట్వీట్‌ను మేం తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాం. ఇబ్బంది కలిగినందుకు యూజర్లు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం’’ అని ఆర్‌సీబీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని