IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
అతి త్వరలోనే అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా మారుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అతి త్వరలోనే అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా మారుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వ్యాఖ్యానించాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వల్ల మహిళా క్రికెట్‌కు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఇలా ఊపందుకోవడం అద్భుతమైన ముందుడుగుగా అభివర్ణించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్రికెట్ లీగ్‌లు రావడం వల్ల ఆటగాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నాడు.
‘‘భారత ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తే.. 2040కల్లా యూఎస్‌లోని ఫుట్‌బాల్ లీగ్ కంటే ఐపీఎల్ విలువ ఎక్కువ కానుంది. ఇప్పుడున్న దానికంటే ఆరింతలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ క్రీడా టోర్నమెంట్‌గా మారుతుంది. ప్రపంచం నలుమూలాల క్రికెట్‌ను విస్తరించడానికి ఫ్రాంచైజీ క్రికెట్ సరిగ్గా సరిపోతుంది. క్రికెట్‌కు అభిమానులను మరింత చేరువ చేయడానికి ఇదొక అద్భుతమైన అడుగు. ఇలా చేయడం వల్ల చాలామంది ఆటగాళ్లు అంతర్జాతీయంగా వేర్వేరు ప్రదేశాల్లో క్రికెట్‌ను ఆడేందుకు అవకాశం దొరుకుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్తవారిని కలవడం జరుగుతుంది. మహిళా క్రికెట్‌కు మరింత ఊతం ఇచ్చేలా ‘మహిళల ప్రీమియర్ లీగ్’ (WPL) అక్కరకొస్తుంది. మహిళల క్రికెట్ నాణ్యత ఇంకా పెరుగుతుంది’’ అని తెలిపాడు. ఇప్పటికే ఆసీస్‌లో బిగ్‌బాష్ లీగ్, వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈ, దక్షిణాఫ్రికాలోనూ టీ20 లీగ్‌లు వచ్చేశాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Abhishek Banerjee: నన్ను, నా భార్యాపిల్లల్ని అరెస్టు చేసినా.. తలవంచను..: అభిషేక్ బెనర్జీ
-
Sports News
Shubman Gill: అతడి ప్రశంసలకు గిల్ పూర్తి అర్హుడు: పాక్ మాజీ కెప్టెన్
-
World News
USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా
-
General News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్.. సికింద్రాబాద్‌లో స్మార్ట్ కాపీయింగ్
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!