IPL:‘భారత్‌ను వీడుతున్నందుకు క్షమించండి’ 

బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా  కరోనా బారినపడుతుండటంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఐపీఎల్‌లో పాల్గొనడానికి

Published : 06 May 2021 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా  కరోనా బారినపడుతుండటంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఐపీఎల్‌లో పాల్గొనడానికి  విదేశాల నుంచి  వచ్చిన ఆటగాళ్లు, ఇతర విభాగాలకు చెందిన వారు తమ స్వదేశాలకు తిరుగుపయనమవుతున్నారు. ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా ఉన్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్‌ డౌల్‌ కూడా బుధవారం భారత్‌ను వీడారు. ఈ సందర్భంగా భారతీయులు క్షేమంగా ఉండాలని భావోద్వేగపూరిత సందేశాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

‘‘ డియర్ ఇండియా, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నాకు చాలా ఇచ్చావు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీడుతున్నందుకు క్షమించు. కష్టాల్లో ఉన్న మీ కోసం మీ కుటుంబసభ్యుల కోసం నా హృదయం తల్లడిల్లుతోంది. పరిస్థితులు మెరుగయ్యేంత వరకు దయచేసి వీలైనంత జాగ్రత్తగా ఉండటానికి  ప్రయత్నించండి’’ అని సైమన్‌ డౌల్‌ ట్వీట్ చేశాడు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని