IRE vs IND : దంచికొట్టిన టెక్టార్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

ఐర్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటింగ్‌ ముగిసింది. వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌ని 12 ఓవర్లకు కుదించారు. 12 ఓవర్లలో ఐర్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టెక్టార్‌ (64; 33 బంతుల్లో

Published : 27 Jun 2022 00:25 IST

డబ్లిన్‌: ఐర్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటింగ్‌ ముగిసింది. వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌ని 12 ఓవర్లకు కుదించారు. 12 ఓవర్లలో ఐర్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టెక్టార్‌ (64; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3  సిక్స్‌లు) రాణించగా.. టకర్ (18) ఫర్వాలేదనిపించాడు. తొలుత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వరుసగా వికెట్లు తీయడంతో 4 ఓవర్లకు ఐర్లాండ్ 22/3 స్కోరుతో కష్టాల్లో పడింది. బాల్‌బిర్నీ (0), స్టిర్లింగ్ (4)‌, డెలానీ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. తర్వాత టెక్టార్, టకర్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఆరో ఓవర్‌లో టెక్టార్ ఓ ఫోర్‌, సిక్సర్‌ కొట్టగా.. హార్దిక్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్‌లో టకర్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌, హార్దిక్ పాండ్య, అక్షర్‌ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు