Updated : 27 Jun 2022 01:35 IST

IRE vs IND: ఐర్లాండ్‌పై అలవోకగా..

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌ని 12  ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 9.2 ఓవర్లలోనే ఛేదించింది. దీపక్‌ హుడా (47*; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. హార్దిక్ పాండ్య (24; 11 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తిక్‌ 5* పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ రెండు, లిటిల్ ఒక వికెట్ తీశారు. 

ఒకే ఒక్కడు.. 

ఐర్లాండ్ బ్యాటర్లలో టెక్టార్‌ (64; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3  సిక్స్‌లు) రాణించగా.. టకర్ (18) ఫర్వాలేదనిపించాడు. తొలుత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వరుసగా వికెట్లు తీయడంతో 4 ఓవర్లకు ఐర్లాండ్ 22/3 స్కోరుతో కష్టాల్లో పడింది. బాల్‌బిర్నీ (0), స్టిర్లింగ్ (4)‌, డెలానీ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. తర్వాత టెక్టార్, టకర్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఆరో ఓవర్‌లో టెక్టార్ ఓ ఫోర్‌, సిక్సర్‌ కొట్టగా.. హార్దిక్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్‌లో టకర్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌, హార్దిక్ పాండ్య, చాహల్‌ తలో వికెట్ పడగొట్టారు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని