Updated : 25 May 2022 14:35 IST

Bangalore : బెంగళూరుతో జాగ్రత్త.. మామూలుగా ఉండదు: ఇర్ఫాన్‌ పఠాన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించి గుజరాత్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రాజస్థాన్‌ రెండో క్వాలిఫయిర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌ విజేతతో తలపడనుంది. ఈ క్రమంలో లఖ్‌నవూ-బెంగళూరు పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరుకు కాస్త అదృష్టం కలిసిరావాలని కొందరు విశ్లేషకులు అంటుండగా.. మరికొందరు తమదైన రోజున ఎలాంటి జట్టునైనా బెంగళూరు ఓడిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా బెంగళూరును తేలికగా అంచనా వేయొద్దని ప్రత్యర్థులకు సూచించాడు. లీగ్‌ దశలో ఆఖరి నాలుగు మ్యాచుల్లో బెంగళూరు మూడింట్లో గెలిచిందని.. కాబట్టి డేంజరస్‌గా ఆడుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నాడు.

‘‘బెంగళూరు వరుసగా మూడోసారి ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడుతోంది. అయితే ఇతర జట్లు అన్నీ బెంగళూరును చూసి ఆందోళనకు గురవుతున్నట్లుగా ఉంది. గుజరాత్‌ మీద విజయం సాధించడంతోపాటు అదృష్టం కలిసిరావడం.. విరాట్ కోహ్లీ ఫామ్‌ అందిపుచ్చుకోవడం ప్రత్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. కోహ్లీ తన ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. గుజరాత్‌పై కీలక సమయంలో హాఫ్ సెంచరీ సాధించాడు.  అందుకే చెబుతున్నా మిగిలిన మూడు జట్లూ కంగారు పడటం ఖాయం’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌ మాజీ ప్లేయర్ గ్రేమ్‌ స్వాన్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించాడు. ప్లేఆఫ్స్‌లో బెంగళూరు మిగతా జట్లపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని