MS Dhoni: చంద్రుడిపైకి వెళ్లినా సీఎస్‌కే అభిమానులు ఉంటారు : ఇర్ఫాన్‌ పఠాన్‌

గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ అయినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కే (CSK vs GT) భారీగా అభిమానుల మద్దతు ఉండనుంది. 

Published : 29 May 2023 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPl 2023)  ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ ఇవాళ్టికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక అయినప్పటికీ గుజరాత్‌ కంటే చెన్నై సూపర్ కింగ్స్‌కే అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఎంఎస్ ధోనీ. సీఎస్‌కే కెప్టెన్‌కు ఇదే చివరి సీజన్‌గా భావిస్తున్న తరుణంలో ఫ్యాన్స్‌ భారీ సంఖ్యలో మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ధోనీ ఫ్యాన్స్‌బేస్‌ గురించి టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘సీఎస్‌కేను ప్రతి జట్టూ అభిమానిస్తుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నారు. ఒక్కసారి వారు ప్రేమించడం మొదలుపెట్టాక పూజిస్తారు. భక్తులుగా మారిపోతారు. సినీ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ను ఎంత అభిమానిస్తారో మహేంద్ర సింగ్ ధోనీని కూడా అంతే ప్రేమిస్తారు. కేవలం తమిళనాడులోనే కాదు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్లినా వారుంటారు. చంద్రమండలంలోకి వెళ్లినా (నవ్వుతూ) సీఎస్‌కే అభిమానులు ఉంటారు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ సొంతమైదానంలో మ్యాచ్ జరగనున్నప్పటికీ సీఎస్‌కేకు భారీ సంఖ్యలో మద్దతు వస్తోంది. ఎంఎస్ ధోనీ ఆటను చూసేందుకు వారంతా వస్తున్నారు. మ్యాచ్‌ను లక్ష మందికిపైగా అభిమానులు ప్రత్యక్షంగా చూస్తారని అంచనా. నేటి మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారబోదని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పూర్తి స్థాయి ఆటను వీక్షించే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు