Olympics: పారిస్‌కు ఇషా

పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లే భారత జట్టులో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ చోటు దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే 15 మంది రైఫిల్, పిస్టల్‌ బృందాన్ని మంగళవారం భారత షూటింగ్‌ సమాఖ్య ప్రకటించింది.

Published : 12 Jun 2024 04:15 IST

మను, రిథమ్‌ కూడా
దిల్లీ

పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లే భారత జట్టులో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ చోటు దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే 15 మంది రైఫిల్, పిస్టల్‌ బృందాన్ని మంగళవారం భారత షూటింగ్‌ సమాఖ్య ప్రకటించింది. మహిళల 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఇషా పోటీపడబోతోంది. ఇంతకుముందే బెర్తు దక్కించుకున్నా.. ట్రయల్స్‌లో పాల్గొని సత్తా చాటడం ద్వారా ఇషా పారిస్‌ టికెట్‌ ఖరారు చేసుకుంది. మరోవైపు ట్రయల్స్‌లో అదరగొట్టిన స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ రెండు ఈవెంట్ల్లలో బరిలో దిగనుంది. 10 మీటర్ల పిస్టల్,     25 మీటర్ల పిస్టల్‌ విభాగాల్లో ఆమె పోటీలో ఉంది. సందీప్‌సింగ్, అర్జున్‌ బబుతా, ఇలవేనిల్, రమిత (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌) సిఫ్త్‌కౌర్‌ శర్మ, అంజుం మౌద్గిల్, ఐశ్వరీ తోమర్, స్వప్నిల్‌ కుస్లే (50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌), సరబ్‌జ్యోత్‌ సింగ్, అర్జున్‌ చీమా, రిథమ్‌ సాంగ్వాన్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), అనీష్‌ బన్వాల్, విజయ్‌వీర్‌ సిద్ధూ (25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌) కూడా పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్నారు. ట్రయల్స్‌లో రాణించలేకపోయిన రైఫిల్‌ ప్రపంచ ఛాంపియన్‌ రుద్రాంక్ష్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. వ్యక్తిగత విభాగాలతో పాటు రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ విభాగాల్లో అయిదు మిక్స్‌డ్‌ జట్లు కూడా బరిలో దిగనున్నాయి. జూన్‌ 18న ఇటలీ ఆరంభమయ్యే ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత షాట్‌గన్‌ జట్లను కూడా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో రియో, టోక్యో ఒలింపిక్స్‌ (12)తో పోలిస్తే పారిస్‌కు భారత్‌ ఎక్కువమంది షూటర్లను పంపుతోంది. రియో, టోక్యోల్లో భారత షూటర్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని