MI vs CSK: కృనాల్‌ వద్దు కిషన్‌ ముద్దు!

కీలకమైన నాలుగో స్థానంలో కృనాల్‌ పాండ్యను ఆడించడం తనకు నచ్చలేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. అతడికి తాను వ్యతిరేకం కాదని, ఆ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ మెరుగైన ఆటగాడని పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌లో..

Published : 01 May 2021 23:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీలకమైన నాలుగో స్థానంలో కృనాల్‌ పాండ్యను ఆడించడం తనకు నచ్చలేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. అతడికి తాను వ్యతిరేకం కాదని, ఆ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ మెరుగైన ఆటగాడని పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌లో నలుగురు ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌ ఉండటంతో కృనాల్‌ స్థానంలో జయంత్‌ను ఆడిస్తే మంచిదన్నాడు.  శనివారం ముంబయి, చెన్నై తలపడుతున్న సంగతి తెలిసిందే.

‘ఇషాన్‌ను ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ముంబయికి చాలామంది బౌలర్లు ఉన్నారు. కృనాల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు. దీనర్థం అతనంటే నాకిష్టం లేదని కాదు. నాలుగో స్థానానికి కిషన్‌ మెరుగైన ఆటగాడు. రాజస్థాన్‌ పోరులో కృనాల్‌తో బౌలింగూ ఎక్కువగా చేయించలేదు. కేవలం ఒక్క ఓవరే ఇచ్చారు. చెన్నైలోనూ ఎడమచేతివాటం ఆటగాళ్లు ఎక్కువే ఉన్నారు. ముందు మొయిన్‌, సురేశ్‌ రైనా ఆ తర్వాత జడ్డూ, సామ్‌ కరన్‌ ఆడతారు. ఇక్కడా కృనాల్‌ బౌలింగ్‌ చేసేందుకు ఆస్కారం లేదు’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

చెన్నై పోరులో కృనాల్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను ఆడిస్తే మెరుగని ఆకాశ్‌ సూచించాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. మిగతా జట్టులో మార్పులేమీ అవసరం లేదన్నాడు. చెన్నైలో కిషన్‌ బాగానే ఆడాడని, మరీ ఘోర ప్రదర్శనలేమీ లేవన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని