ICC Rankings: ఏకంగా 40 స్థానాలను ఎగబాకిన దీపక్ హుడా
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఆటగాడు దీపక్ హుడా కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి పురోగతి సాధించాడు. తాజాగా టాప్ -100 జాబితాను ఐసీసీ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో భారత క్రికెటర్ దీపక్ హుడా ఐసీసీ టాప్ -100 జాబితాలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో వింతేముంది అంటారా..? ఆ మ్యాచ్‌లో చేసిన ప్రదర్శనకు దాదాపు 40 స్థానాలను ఎగబాకి పైకి రావడం విశేషం. శ్రీలంకపై తొలి టీ20 మ్యాచ్‌లో ఆరోస్థానంలో వచ్చిన దీపక్ హుడా కీలకమైన 41 పరుగులు (23 బంతుల్లో) చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ఫార్మాట్ బ్యాటర్ల టాప్ - 100 జాబితాలో చోటు సంపాదించాడు. ప్రస్తుతం 374 పాయింట్లతో 97వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టీమ్ఇండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పది స్థానాలను మెరుగుపర్చుకొని 23వ ర్యాంక్‌కు చేరాడు. ఇషాన్ (567 పాయింట్లు) లంకపై 39 పరుగులతో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. ఇక తొలి స్థానం సూర్యకుమార్ యాదవ్‌దే (883 పాయింట్లు). లంకతో ఈ సిరీస్‌లో సూర్య ప్రదర్శనతో సంబంధం లేకుండా మొదటి ర్యాంక్ కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ (836)కి సూర్యకుమార్‌కు మధ్య తేడా భారీగానే ఉంది. టాప్ -10లో సూర్య తప్ప ఇతర భారత ఆటగాళ్లు ఎవరూ లేరు.
బౌలర్ల విభాగంలో..
ఐసీసీ బౌలర్ల విభాగంలో టాప్ -10 జాబితాలో ఒక్కరూ టీమ్ఇండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్దిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంక్ అందుకొన్నాడు. టీమ్ఇండియా ఉత్తమ ప్రదర్శన చేసిన శ్రీలంక బౌలర్ హసరంగ (709 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రషీద్ ఖాన్ (698) ఉన్నాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ (641) మాత్రమే 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్ఇండియా నుంచి హార్దిక్ పాండ్య (209) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. వనిందు హసరంగ (182) రెండు స్థానాలను మెరుగుపర్చుకొని ఐదుకి చేరాడు. బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ (252) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
కోల్‌కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్‌ను తప్పించాల్సిందే
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్