Ishan Kishan: ఇషాన్‌ కిషన్ రికార్డు ‘డబుల్‌’ సెంచరీ.. భారత్‌ నుంచి నాలుగో బ్యాటర్

యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ వన్డేల్లో అనితర సాధ్యమైన డబుల్‌ సెంచరీ మార్క్‌ను తాకాడు. ద్విశతకం సాధించిన నాలుగో భారత ఆటగాడిగానూ, అంతర్జాతీయంగా ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

Updated : 10 Dec 2022 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అవకాశం వస్తే చాలు విజృంభించడానికి సిద్ధమని టీమ్‌ఇండియా కుర్రాళ్లు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి సమయంలో అందివచ్చిన అవకాశాన్ని టీమ్‌ఇండియా యువ ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (210: 134 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లు) చక్కగా అందిపుచ్చుకొని బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఏకంగా రికార్డు డబుల్‌ సెంచరీ బాదేశాడు. ఇలా భారత్ తరఫున ద్విశతకం బాదిన నాలుగో బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కావడం విశేషం. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించి.. ఇప్పటి వరకు క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు.

అంతర్జాతీయంగా ఇప్పటి వరకు తొమ్మిది డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో భారత్ నుంచే నలుగురు బ్యాటర్లు ఆరు ద్విశతకాలు బాదారు. టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు (264, 209, 208*) డబుల్‌ సెంచరీలు చేశాడు. అలాగే వ్యక్తిగత స్కోర్లలో రోహిత్ (264) టాప్‌ కావడం గమనార్హం. భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్‌ (219), సచిన్ తెందూల్కర్ (200*) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా మార్టిన్ గప్తిల్ (237*, కివీస్), క్రిస్ గేల్‌ (215, విండీస్‌), ఫఖర్ జమాన్ (210*) కూడా ద్విశతకాలను సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని