Ishan Kishan : నా బలం అదే.. అలాంటప్పుడు స్ట్రైక్‌ ఎందుకు రొటేట్‌ చేస్తాను : ఇషాన్‌ కిషన్‌

కొందరికి స్ట్రైక్‌ రొటేట్‌ చేసే బలం ఉంటుంది. మరికొంతమందికి భారీ షాట్లు కొట్టడంలో బలం ఉంటుంది. సిక్సర్లు కొట్టడం నా బలం.

Published : 10 Oct 2022 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : దక్షిణాఫ్రికాపై తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమ్‌ ఇండియా.. సిరీస్‌ రేసులో నిలిచింది. రెండో వన్డేలో ఆ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడి భారత్‌కు విజయాన్ని అందించారు. అయితే.. ఇషాన్‌ (93; 84 బంతుల్లో 4×4, 7×6) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం అతడు పలు అంశాలపై మాట్లాడాడు.

‘మేం ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. తప్పులను విశ్లేషించి.. ఇంకా మెరుగ్గా ఎలా ఆడాలో నేర్చుకుంటాం. ఈ మ్యాచ్‌లో శతకాన్ని చేజార్చుకున్నా. అయితే.. జట్టు పరంగా చూస్తే 93 స్కోరు చాలా మంచిదే. సెంచరీకి చేరువలో ఔట్‌ కావడం బాధాకరమే. మరోసారి ఇలా సెంచరీని మిస్‌ చేసుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను’ అని ఇషాన్‌ అన్నాడు.

ఇక స్ట్రైక్‌ రొటేషన్‌ విషయంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ..‘కొందరికి స్ట్రైక్‌ రొటేట్‌ చేసే బలం ఉంటుంది. మరికొంతమందికి భారీ షాట్లు కొట్టడంలో బలం ఉంటుంది. సిక్సర్లు కొట్టడం నా బలం. నాలా కొంత మంది సిక్స్‌లు కొట్టలేరు. నా బలం అదే అయినప్పుడు స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం గురించి పెద్దగా ఆలోచించను. కొన్ని సందర్భాల్లో స్ట్రైక్‌ రొటేట్‌ చేసే అవసరం ఉంటుంది. అయితే.. సరైన బంతులు వచ్చినప్పుడు.. నా బలం సిక్స్‌లు కొట్టడమే కాబట్టి.. నాకు నేను స్ట్రైక్‌ రొటేట్‌ చేసుకునేలా బలవంతం చేసుకోను. నేను సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఉన్నాను. అలాంటి సమయంలో సింగిల్స్‌తో వాటిని పూర్తి చేయలేను. నేను దేశం కోసం ఆడుతున్నాను. నా వ్యక్తిగత పరుగుల కోసం ఆలోచిస్తే.. నేను అభిమానులను నిరాశపరిచినట్లే’ అని ఇషాన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు