Shane Warne : వార్న్‌ పంపిన ఆ మెసేజ్‌ని ఎప్పటికీ డిలీట్‌ చేయను : గిల్‌ క్రిస్ట్‌

లెజెండరీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ తనకు పంపిన చివరి మెసేజ్‌ను ఎప్పటికీ డిలీట్ చేయనని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్‌ ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్ అన్నాడు. గత శుక్రవారం (మార్చి 4న) షేన్‌ వార్న్‌ థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సమూయిలోని తన రిసార్ట్‌లో మృతి చెందిన..

Published : 11 Mar 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్ : లెజెండరీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ తనకు పంపిన చివరి మెసేజ్‌ను ఎప్పటికీ డిలీట్ చేయనని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్‌ ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్ అన్నాడు. గత శుక్రవారం (మార్చి 4న) షేన్‌ వార్న్‌ థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సమూయిలోని తన రిసార్ట్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.

‘వారం క్రితం నేను వార్న్‌తో మాట్లాడాను. ఆ తర్వాత కొద్ది గంటలకే అతడు చనిపోయాడనే వార్త తెలిసింది. నన్నెప్పుడూ ‘చర్చ్‌’ అని పిలిచేవాడు. అతడు అలా ఆప్యాయంగా పిలుస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది. రాడ్‌ మార్ష్‌ అంత్యక్రియలకు నేను వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను. అది చూసిన వార్న్‌ నాకు.. ‘చర్చ్‌, వండర్‌ఫుల్‌ ట్రిబ్యూట్ టు రాడ్ మార్ష్‌’ అని చివరి సారిగా మెసేజ్‌ చేశాడు. ఆ మెసేజ్‌ని నేనెప్పటికీ డిలీట్‌ చేయను. వార్న్‌ బౌలింగ్‌కి వికెట్‌ కీపింగ్ చేయడం నా క్రికెటింగ్‌ కెరీర్‌లో మరిచిపోలేని అనుభూతి. మైదానంలో వార్న్‌ క్యాప్ తీశాడంటే.. అభిమానులంతా తర్వాత బౌలింగ్ చేసేది అతడే అని భావించేవారు. అద్భుతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించేవాడు. మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉండేది’ అని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.

మార్చి 10 (గురువారం) ఉదయం షేన్‌ వార్న్‌ పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు తరలించారు. అక్కడి ప్రభుత్వం వార్న్‌కి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 30న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం (ఎమ్‌సీజీ)లో వార్న్‌ సంస్మరణ సభ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని