కోహ్లీ గైర్హాజరుపై ప్యాట్‌ కమిన్స్‌ వ్యాఖ్యలు

ఆస్ర్టేలియాలో టీంఇండియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇప్పటికే అక్కడికి చేరుకున్న మన ఆటగాళ్లు కఠోర సాధన చేయడం మొదలుపెట్టారు. అయితే పర్యటన మొత్తం ఒక ఎత్తైతే తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి రానున్న టీంఇండియా సారథి

Published : 17 Nov 2020 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆస్ర్టేలియాలో టీంఇండియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇప్పటికే అక్కడికి చేరుకున్న మన ఆటగాళ్లు కఠోర సాధన చేయడం మొదలుపెట్టారు. అయితే పర్యటన మొత్తం ఒక ఎత్తైతే తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి రానున్న టీంఇండియా సారథి విరాట్‌కోహ్లీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోహ్లీ ఇలా పితృత్వ సెలవులు తీసుకొని మిగతా మూడు టెస్టులకు గైర్హాజరవడం జట్టుకు ప్రతికూలంగా మారుతుందని పలువురు మాజీలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లలోని ఆటగాళ్లు విజయం తమదంటే తమదని మాటలతో మైండ్‌గేమ్‌ మొదలెట్టేశారు. తాజాగా ఆస్ర్టేలియా ఫాస్ట్ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ విరాట్‌ గైర్హాజరుపై స్పందించాడు. ఈ విషయంపై తాము దృష్టి పెట్టడం లేదని పేర్కొన్నాడు. 

‘నిజం చెప్పాలంటే కోహ్లీ గురించి ఇప్పటికే చాలా మాట్లాడేశాం. మొదటి టెస్టు తర్వాత కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం వల్ల మా విజయాల్లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే టీంఇండియా కోహ్లీకి బదులుగా మరో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తుది జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది అవకాశంగా మారొచ్చు. ఇది మరో క్రికెటర్‌ కెరీర్‌ ప్రారంభించడానికి ఉపయోగపడొచ్చు’ అని ఆస్ర్టేలియా ఫాస్ట్‌ బౌలర్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. 

రెండేళ్ల కిందట ఆస్ర్టేలియా పర్యటనలో భాగంగా టీంఇండియా అద్భుతంగా రాణించిందని కమిన్స్‌ అన్నాడు. టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించి రెండు జట్లకు ఈ టెస్టు సీరిస్‌ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సీరిస్‌ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ఫిప్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో తలపడనున్న రెండు జట్లు తొలుత నవంబరు 27న వన్డే మ్యాచ్‌ ఆడనున్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని