WTC Final: ఆట ఆలస్యం.. వరుణుడి జోరు

అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నాలుగో రోజు ఆట ఇంకా మొదలవ్వలేదు. వేకువజాము నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించినా జల్లులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచింది....

Published : 21 Jun 2021 15:35 IST

వ్యాపకాల్లో మునిగిపోయిన క్రికెటర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నాలుగో రోజు ఆట ఇంకా మొదలవ్వలేదు. వేకువజాము నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించినా జల్లులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచింది. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. అక్కడక్కడా వరద నీరు చేరింది.వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఆటగాళ్లు తమ వ్యాపకాల్లో మునిగిపోయారు.

న్యూజిలాండ్‌ క్రికెటర్లు టేబుల్‌ టెన్నిస్‌ ఆడుకుంటున్నారు. మరికొందరు ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకొందరు డ్రస్సింగ్‌ రూమ్‌ బాల్కనీల్లో వెచ్చని కాఫీలు ఆస్వాదిస్తున్నారు. సౌథాంప్టన్‌లో పరిస్థితి ఎలాఉందో బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఆట ఆలస్యంగా ఆరంభమయ్యేలా ఉందని పేర్కొంది. వాస్తవంగా ఈ రోజంతా అక్కడ వరుణుడిదే ఆధిపత్యమని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు వర్షం కురుస్తున్నప్పుడు మ్యాచులు ఎందుకు పెడుతున్నారని అభిమానులు ఐసీసీని ట్రోల్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని