
IND vs NZ: నిన్న విలియమ్సన్.. నేడు జేమీసన్.. టీ20 సిరీస్‌కు దూరం
ఇంటర్నెట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న టీ20 సిరీస్‌కు మరో కివీస్ ఆటగాడు దూరమయ్యాడు. నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ దృష్ట్యా కివీస్ బౌలర్ కౌల్ జేమీసన్‌కు కూడా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఇంతకు ముందే, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఇదే కారణంతో టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ‘కెప్టెన్ కేన్ విలియమ్సన్, కైల్ జేమీసన్‌తో మాట్లాడిన అనంతరం.. రానున్న టెస్టు సిరీస్ దృష్ట్యా వారిద్దరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న మరి కొందరు యువ ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వెంట వెంటనే పలు కీలక సిరీస్‌లు ఉండటంతో ఇలా చేయక తప్పడం లేదు’ అని కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్’ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్ జట్టు టెస్టుల్లో విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
మూడు టీ20 మ్యాచ్‌ల్లో భాగంగా.. తొలి మ్యాచ్ జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రోజు (బుధవారం) సాయంత్రం ప్రారంభం కానుంది. నవంబర్ 19న కాన్పుర్ వేదికగా, నవంబర్ 21న ముంబయి వేదికగా మిగతా మ్యాచ్‌లు జరుగనున్నాయి.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.