IPL 2022 : థ్యాంక్యూ హార్దిక్‌.. ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చిన జేసన్‌ రాయ్‌

ఇంగ్లాండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నుంచి తప్పుకోవడంపై తాజాగా వివరణ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ మెగా టోర్నీ నుంచి..

Published : 01 Mar 2022 23:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఇంగ్లాండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నుంచి తప్పుకోవడంపై తాజాగా వివరణ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తన ఆటపై నమ్మకం ఉంచి మెగా వేలంలో రూ.2 కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

‘గుజరాత్‌ టైటాన్స్‌ అభిమానులు, జట్టు సభ్యులందరికీ నమస్కారం. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ టోర్నీ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉంది. ఇటీవల ముగిసిన మెగా వేలంలో నాపై నమ్మకం ఉంచి దక్కించుకున్న గుజరాత్‌ టైటాన్స్ యాజమాన్యం, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు ధన్యవాదాలు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. ఆ ప్రభావం నాపై కూడా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబంతో గడపడమే సరైనదని నేను భావిస్తున్నాను. అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నాను. ఈ రెండు నెలల సమయంలో ఖాళీగా ఉండకుండా.. నా ఆటతీరును మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెడతాను. అలాగే, గుజరాత్ టైటాన్స్ ఆడనున్న ప్రతి మ్యాచును ఫాలో అవుతాను. జట్టుకు మద్దతుగా నిలుస్తాను. మా జట్టు ఆడనున్న తొలి సీజన్‌లోనే ట్రోఫీ సాధించాలని కోరుకుంటున్నాను’ అని జేసన్‌ రాయ్‌ ట్వీట్ చేశాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, జేసన్‌ రాయ్‌ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయంపై గుజరాత్ యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు