Bumrah - Rana: టీ20 లీగ్‌ నియమావళి ఉల్లంఘించిన నితీశ్‌ రానా, జస్ప్రిత్‌ బుమ్రా

పుణె వేదికగా గతరాత్రి ముంబయి, కోల్‌కతా తలపడిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు జస్ప్రిత్‌ బుమ్రా, నితీశ్‌ రాణా లీగ్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు....

Published : 07 Apr 2022 14:49 IST

(Photo: Jasprit Bumrah Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: పుణె వేదికగా గతరాత్రి ముంబయి, కోల్‌కతా తలపడిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు జస్ప్రిత్‌ బుమ్రా, నితీశ్‌ రాణా లీగ్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు. దీంతో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ రానాకు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు హెచ్చరించి వదిలేశారు. మరోవైపు ముంబయి పేసర్‌ బుమ్రాను కేవలం హెచ్చరించారు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, వీరిద్దరూ ఏ నేరం చేశారన్నది మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ నేరాన్ని అంగీకరించినట్లు స్పష్టం చేశారు.

(Photo: Nitish Rana Instagram)

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (52; 36 బంతుల్లో 5x4, 2x6), తిలక్‌ వర్మ (38 నాటౌట్‌; 27 బంతుల్లో 3x4, 2x6), పొలార్డ్‌ (22; 5 బంతుల్లో 3x6) దంచికొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (50; 41 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకానికి తోడు ప్యాట్‌ కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) చెలరేగడంతో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని