T20 Worldcup: టీ20 వరల్డ్‌ కప్‌కు బుమ్రా దూరం

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కూ దూరం కానున్నాడు.

Published : 04 Oct 2022 01:07 IST

ముంబయి: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌నకూ దూరం కానున్నాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై వైద్య నిపుణుల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా స్థానంలో జట్టులో ఎవరికి చోటు కల్పించనున్నారనే విషయాన్ని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ తలపడనుంది. గ్రూప్‌-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. అక్టోబర్‌ 23న దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ తొలిపోరు జరగనుంది. నవంబర్‌ 9న తొలి సెమీఫైనల్‌ కాగా, నవంబర్‌ 10న రెండో సెమీస్‌ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని