Updated : 13 Mar 2022 16:12 IST

Bumrah : బుమ్రా ఐదు వికెట్ల ఫీట్‌.. స్వదేశంలో ఇదే తొలిసారి!

ఇంటర్నెట్ డెస్క్‌ : శ్రీలంకతో జరుగుతున్న గులాబీ బంతి (పింక్ బాల్) టెస్టులో టీమ్ఇండియా బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా (5/24) చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో  లంకను 109 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా తొలిసారి స్వదేశంలో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. కెరీర్‌లో 29వ టెస్టు ఆడుతున్న బుమ్రా ఎనిమిదిసార్లు ‘ఐదు వికెట్ల’ను పడగొట్టగా.. ఇందులో ఏడు విదేశీ పిచ్‌లపైనే సాధించాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో రెండేసి మార్లు, ఒకసారి ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 252 పరుగులు చేయగా.. శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని