Published : 02 Jul 2022 02:13 IST

Jasprit Bumrah: అది అర్థమయ్యేసరికి బుమ్రాకు సమయం పట్టింది: సంజన

(Photo: Jasprit Bumrah Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: బుమ్రా టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌గా ఎంపికవ్వడం పట్ల అతడి తల్లి దల్జీత్‌ సంతోషం వ్యక్తం చేశారని అతడి సతీమణి సంజన గణేశన్‌ చెప్పారు. ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి తల్లి ఉబ్బితబ్బిబ్బయ్యారని సంజన పేర్కొన్నారు.

‘బుమ్రా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అతడి తల్లి కోరుకునేది. చిన్నప్పటి నుంచి అతడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో ఆమె స్వయంగా చూసింది. అతడు ఇప్పుడు టీమ్‌ఇండియా జట్టుకే కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలియగానే ఆమె గర్వపడింది. అలాగే బుమ్రా తల్లికి క్రికెట్‌ గురించి పెద్దగా తెలియకపోయినా.. ఆటలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను ఎప్పుడూ అతడికి చెబుతుంటుంది’ అని సంజన వివరించారు.

అయితే, బుమ్రాకు కెప్టెన్సీ అనేది అంత తేలిగ్గా రాలేదని, రోహిత్‌ తర్వాత ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించగలడా లేదా అని పరిశీలించాకే జట్టు పగ్గాలు వచ్చాయని సంజన వివరించారు. మరోవైపు రోహిత్‌ తుది జట్టులో ఉండేందుకు యాజమాన్యం ఆఖరి నిమిషం వరకూ ఎదురు చూసిందని చెప్పారు. అలా బుమ్రాకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కెప్టెన్సీ వచ్చిందన్నారు. అది అర్థం చేసుకునేందుకు బుమ్రాకూ కాస్త సమయం పట్టిందని తెలిపారు. ఎట్టకేలకు కెప్టెన్సీ పగ్గాలు దక్కడంతో బుమ్రా సంతోషంగా ఉండటంతో పాటు గర్వపడుతున్నాడని సంజన స్పష్టం చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని