ICC - Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జై షా!

బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) ఐసీసీ ఛైర్మన్‌ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated : 08 Jul 2024 18:55 IST

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తదుపరి ఛైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో టర్మ్‌  ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. అయితే, బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) ఐసీసీ ఛైర్మన్‌ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జై షా మద్దతుతోనే బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం.

కానీ, జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జై షా ఈ పదవిని చేపడితే అత్యంత పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అనే దానిపై జై షా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, ఐసీసీ వార్షిక సమావేశం జులై 19 - 22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని