Prithvi Shaw: పృథ్వీని చూస్తే గర్వంగా ఉంది: బీసీసీఐ కార్యదర్శి

రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోర్‌ సాధించిన బ్యాటర్‌గా పృథ్వీషా నిలిచాడు. ఈ నేపథ్యంలో పృథ్వీషాపై బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రశంసలు కురిపించాడు. అతడిని చూసి గర్వపడుతున్నాని జై షా తెలిపాడు.

Published : 13 Jan 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుధవారం జరిగిన రంజీ ట్రోఫీ ఐదో రౌండ్‌ మ్యాచ్‌లో ముంబయి యువ బ్యాటర్‌ పృథ్వీషా 379 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. పృథ్వీషాని చూసి గర్వపడుతున్నానని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నాడు. 

అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ 49 బౌండరీలు, 4 సిక్సులు బాదాడు. కేవలం 383 బంతుల్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా పృథ్వీ నిలిచాడు. అంతేకాక రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. దాంతో పలువురు ఆటగాళ్లు, నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ.. ‘‘రికార్డు పుస్తకాల్లోకి మరో పేరు చేరింది. పృథ్వీషా ఇన్నింగ్స్‌ అత్యద్భుతంగా ఉంది. అతడు అపారమైన సామర్థ్యం కలిగిన ప్రతిభావంతుడు. అతడిని చూస్తే చాలా గర్వంగా ఉంది. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోరు సాధించిన పృథ్వీషాకు శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశాడు.
ప్రతిస్పందించిన పృథ్వీ షా..‘‘మీ మాటలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. నేను అనుకున్నది సాధించేవరకు కష్టపడుతూనే ఉంటాను’’ అని రీట్వీట్‌ చేశాడు.

‘‘త్రిశతకం సాధించినందుకు ఆనందంగా ఉంది. నేను బాగానే బ్యాటింగ్‌ చేశానని అనుకుంటున్నాను. కానీ నేను ఆశించిన 400 పరుగులు సాధించలేదు. ఆట మధ్యలో ఎక్కువ సహనం ప్రదర్శించాను. వికెట్ కోల్పోకుండా ఆడటానికి అది అవసరమని భావించాను. అప్పుడు ఎక్కువ పరుగులు రాబట్టాల్సింది’’ అని పృథ్వీ మీడియాకి వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని