Jemimah Rodrigues: ఆసియా కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు.. టాప్‌-10లోకి రోడ్రిగ్స్‌

టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్‌ ఆసియా కప్‌లో అదరగొట్టేస్తోంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకొచ్చింది. నాలుగు స్థానాలను ఎగబాకి 8వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Published : 05 Oct 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌లో అదరగొట్టేస్తున్న టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకొచ్చింది. బ్యాటర్ల విభాగంలో రోడ్రిగ్స్‌ టాప్‌-10లోకి వచ్చేసింది. నాలుగు స్థానాలను మెరుగుపర్చుకొని ప్రస్తుతం 8వ స్థానంలో రోడ్రిగ్స్ (641 పాయింట్లు) కొనసాగుతోంది. ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకపై 76 పరుగులను సాధించింది. అయితే మలేషియాతో మ్యాచ్‌లో రోడ్రిగ్స్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. తాజాగా యూఏఈపైనా 45 బంతుల్లోనే 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (743) అగ్రస్థానంలో ఉండగా.. మెగ్‌ లానింగ్‌ (725), స్మృతి మంధాన (717) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత ఓపెనర్‌ షఫాలీ వర్మ (648) ఏడో స్థానంలో ఉండటం విశేషం. టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ (605) పదమూడో స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts