Joel paris: ఒకే బంతికి 16 పరుగులు సమర్పించుకున్న బౌలర్
బిగ్ బాష్ లీగ్‌లో ఓ బౌలర్ ఒక బంతికి ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంతకీ అది ఎలాగంటే?
ఇంటర్నెట్ డెస్క్: బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బౌలర్ ఒక బంతి పూర్తయ్యేలోగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ని ఆసీస్ ఫాస్ట్‌బౌలర్ జోయెల్ పారిస్ వేశాడు. ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. మూడో బంతికి మాత్రం స్మిత్ సిక్సర్ బాదాడు. ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్ లభించగా.. అదీ కాస్త వైడ్‌గా వెళ్లి బౌండరీని తాకడంతో మొత్తం ఐదు పరుగులొచ్చాయి. తర్వాత ఫ్రీ హిట్‌ని స్మిత్ బౌండరీకి పంపాడు. దీంతో జోయెల్ పారిస్ ఒక బంతికి 16 పరుగులు సమర్పించుకున్నట్లయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. హోబర్ట్ హరికేన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 156 పరుగులే చేసింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 33 బంతుల్లోనే 66 పరుగులు చేసిన స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Apsara Murder Case: ఇంటర్నెట్లో శోధించి.. పథకం ప్రకారమే అప్సర హత్య
-
Sports News
WTC Final : అసలేం జరుగుతోంది..? సిరాజ్‌పై గావస్కర్ అసహనం..
-
Movies News
Ileana: ఆశను కోల్పోయిన వేళ.. నా కన్నీళ్లు తుడిచాడు: ప్రియుడి గురించి ఇలియానా తొలి పోస్ట్
-
Politics News
Revanth Reddy: కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
-
Crime News
Gold seized: నెల్లూరు, హైదరాబాద్‌లో 10.27 కిలోల బంగారం పట్టివేత
-
Politics News
Ajit Pawar: అజిత్ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే