John Cena: కెరీర్‌కు WWE స్టార్‌ జాన్‌ సీనా గుడ్‌బై.. చివరి పోరు ఎప్పుడంటే?

ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ జాన్‌ సీనా అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించాడు. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

Published : 07 Jul 2024 11:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ WWE రెజ్లర్‌ జాన్‌ సీనా (John Cena) రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెసల్‌మేనియా తన చివరి పోటీ అని పేర్కొన్నారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మనీ (WWE) ఈవెంట్‌కు హాజరైన సీనా ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. 2001లో రెజ్లింగ్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 16 సార్లు WWE ఛాంపియన్‌గా నిలిచారు. జాన్‌ సీనా కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. టీవీ షోల్లోనూ సందడి చేశారు. 

‘‘దాదాపు రెండు దశాబ్దాలకుపైగా రెజ్లింగ్‌లో (wrestling) ఉన్నా. ఎన్నో అనుభవాలను ఆస్వాదించా. ఇప్పుడు వీడ్కోలు నిర్ణయం తీసుకొనేందుకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నా. డబ్ల్యూడబ్ల్యూఈకి ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేం. ఎల్లవేళలా మద్దతుగా నిలిచే అభిమానులే కీలకం. వారి వల్లే కెరీర్‌లో ఉన్నత స్థానాలకు వెళ్లగలం. నా రెజ్లింగ్‌ కెరీర్‌లో తెలుసుకొన్నది ఒక్కటే. కెనడావాసులు ఎప్పుడూ రెజ్లింగ్‌ను ఆదరిస్తూనే ఉంటారు’’ అని సీనా వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని