Published : 28 Jun 2022 02:10 IST

Virat Kohli: కోహ్లీ నా ఫొటోలు వాడుకోవడం గర్వంగా ఉంది.. ఫొటోగ్రాఫర్‌ హర్షం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గతవారం లీసెస్టర్‌తో ఆడిన వార్మప్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 33, రెండో ఇన్నింగ్స్‌లు 67 పరుగులు చేసి బర్మింగ్‌హామ్‌ టెస్టుకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. అంతకుముందు జరిగిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు తరఫున సరిగ్గా ఆడలేకపోయిన అతడు ఇప్పుడు కీలక టెస్టుకు ముందు ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. దీంతో జులై 1 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌ టెస్టులో విరాట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, వార్మప్‌ మ్యాచ్‌ అనంతరం పలు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కోహ్లీ.. లీసెస్టర్‌ జట్టుకు ధన్యవాదాలు చెప్పడమే కాకుండా బర్మింగ్‌హామ్‌ టెస్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

ఇదిలా ఉండగా, విరాట్‌ లీసెస్టర్‌తో ఆడిన ఫొటోలు పంచుకోవడంతో అవి చూసిన ఓ ఫొటోగ్రాఫర్‌ తెగ సంబరపడిపోతున్నాడు. అవి తానే తీశానని, ప్రపంచంలోనే గొప్ప ప్లేయర్‌ అయిన విరాట్‌ కోహ్లీ తన ఫొటోలను వాడుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్‌ చేశాడు. ఆ ఫొటోలను తాను తీయడం గర్వంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. దీంతో ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక ఆ ఫొటోలు తీసిన వ్యక్తి పేరు జాన్‌ మల్లెట్‌. ప్రస్తుతం ఆయన లీసెస్టర్‌ ఫాక్సెస్‌ టీమ్‌కు ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అంతకుముందు ఐటీ, ఇన్సురెన్స్‌ కంపెనీల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఇప్పుడు ఫొటోగ్రాఫర్‌గా మారాడు. ఈ క్రమంలోనే అతడు తీసిన ఫొటోలను విరాట్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో సంబరపడుతున్నాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని