
IPL:అనుజ్ రావత్‌కు బట్లర్ స్పెషల్ గిప్ట్
ఇంటర్నెట్ డెస్క్: బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కొవిడ్ బారినపడుతుండటంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు చేరుకుంటున్నారు. రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా లండన్ బుధవారం చేరుకున్నాడు. లండన్‌కు బయలుదేరకముందు బట్లర్.. అనుజ్ రావత్‌కు ఓ స్పెషల్ గిప్ట్ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో తాను ఉపయోగించిన కీపింగ్ గ్లౌజులపై ‘బెస్ట్ విషెస్ టూ అనూస్’ అని రాసి, రావత్ క్యాప్‌పై సంతకం చేసి ఇచ్చాడు. ఈ ఫొటోలను రాజస్థాన్ రాయల్స్ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటూ‘‘విధ్వంసకరమైన ఆటగాడి నుంచి మరొకరికి ఏదో ఒకటి ఉంచాలి’ అనే వ్యాఖ్యను జతచేసింది. మరో రాజస్థాన్ యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌కు కూడా బట్లర్ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
అనుజ్ రావత్.. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ ఆటగాడిని 2020లో రాజస్థాన్ రాయల్స్ రూ.80 లక్షలకు సొంతం చేసుకుంది. 2021 ఐపీఎల్ సీజన్‌కు అంతే మొత్తం చెల్లించి రిటైన్ చేసుకుంది.ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనుజ్ రావత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. బట్లర్ 124 పరుగులతో చెలరేగడంతో రాజస్థాన్ 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇందులో సంజూ సేన.. 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రావత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.