Jos Buttler : బట్లర్‌కు జరిమానా.. మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత

రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(Jos Buttler)కు జరిమానా పడింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ప్రకటించింది.

Published : 12 May 2023 17:29 IST

జైపుర్‌ : కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌కు ఐపీఎల్‌ జరిమానా విధించింది. ‘ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బట్లర్‌కు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నాం. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.2 కింద లెవెల్‌ 1 స్థాయి ఉల్లంఘనకు అతడు పాల్పడ్డాడు. ఇందులో మ్యాచ్‌ రెఫరీ నిర్ణయమే అంతిమం’ అని ఐపీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అయితే బట్లర్‌ దుష్ప్రవర్తన గురించి ఇందులో స్పష్టంగా పేర్కొననప్పటికీ.. రనౌట్‌ అయిన సమయంలో అతడి వ్యవహారశైలి కారణంగానే జరిమానా విధించినట్లు తెలుస్తోంది.  బట్లర్‌ రెండో ఓవర్‌ నాలుగో బంతికే రనౌట్‌ రూపంలో పరుగులేమీ చేయకుండా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని