Jos Buttler: రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేయాలి: జోస్‌ బట్లర్

రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ప్రస్తుతం జోరుమీదున్నాడు. భారత్‌లో జరుగుతోన్న 15వ సీజన్‌ టీ20 లీగ్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రతి జట్టుపైనా విరుచుకుపడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు....

Published : 24 Apr 2022 01:41 IST

(Photos: Jos Buttler, Rohit Sharma Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ప్రస్తుతం జోరుమీదున్నాడు. భారత్‌లో జరుగుతోన్న 15వ సీజన్‌ టీ20 లీగ్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రతి జట్టుపైనా విరుచుకుపడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు శతకాలు, రెండు అర్థ శతకాలతో మొత్తం 491 పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే గతరాత్రి దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో మరోసారి విధ్వంసం సృష్టించిన అతడు.. మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలు బయటపెట్టాడు. ఓపెనింగ్‌ భాగస్వామిగా ఎవరితో ఆడాలనుకుంటున్నారు అని అడగ్గా.. రాజస్థాన్‌ ఓపెనర్‌.. ప్రస్తుత తరంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరు వెల్లడించాడు. అలాగే పాతతరం క్రికెటర్లలో విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ పేరు చెప్పాడు. మాజీ దిగ్గజం టీ20 క్రికెట్‌ ఆడితే చూడాలని ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక 2018లో ముంబయితో ఆడిన ఇన్నింగ్స్‌.. ఈ టీ20 లీగ్‌లో తన ఫేవరెట్‌ అని చెప్పాడు. అలాగే పవర్‌ప్లేలో ఎవరి బౌలింగ్‌లో ఇబ్బంది పడతావనే ప్రశ్నకు రషీద్‌ ఖాన్‌ పేరు స్పష్టం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని