WTC Final: మరో రెండ్రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) ముంగిట ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా కీలక పేసర్‌ జట్టుకు దూరమయ్యాడు. 

Published : 04 Jun 2023 22:32 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్‌ 7-11 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) తలపడనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్‌ తగిలింది.  కాలి మడమకు గాయం కారణంగా  ఫాస్ట్‌బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్ (Josh Hazelwood) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమయ్యాడు.అయితే గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నహేజిల్‌వుడ్ త్వరలో మైదానంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని, జూన్‌ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసీస్ చీఫ్‌ సెలక్టర్‌ జార్జ్ బెయిలీ వెల్లడించాడు. హేజిల్‌వుడ్ స్థానంలో మరో పేసర్‌ మైఖేల్ నేసర్‌ (Michael Neser)ను జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 

ఆస్ట్రేలియా జట్టు (తాజా మార్పు తర్వాత)

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని