
IPL 2022 Auction: క్రికెట్ గురించి మాట్లాడితే ఆమె ముఖం వెలిగిపోతుంది
కుమార్తె జాహ్నవీపై జూహీ చావ్లా భావోద్వేగ పోస్టు..
(Photo: IPL Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహీచావ్లా కుమార్తె జాహ్నవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా, కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు జాహ్నవి సైతం ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుమార్లు ఆమె కెమెరా దృష్టిలో పడ్డారు. అయితే, తాజాగా జూహీచావ్లా తన కుమార్తెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని క్రికెట్ ప్రేమికులతో పంచుకున్నారు.
‘జాహ్నవి చిన్నప్పటి నుంచే క్రికెట్ చూడటం మొదలు పెట్టింది. అందులోని వ్యాఖ్యాతల మాటలను శ్రద్ధగా వింటూ, ఆటలోని పరిస్థితులను అర్థం చేసుకునేది. ఆమెకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, మేం కుటుంబంతో కలిసి బాలీకి విహారయాత్రకు వెళ్లాం. అక్కడ హోటల్లో మేం కూర్చున్న చోట టేబుల్‌పై ఓ మ్యాగజైన్ కనిపించింది. అది ఒక టెలిఫోన్ డైరెక్టరీ అంత పెద్దగా ఉంది. అందులో ప్రపంచంలోని క్రికెటర్లందరి జీవిత కథలు, విజయాలు, రికార్డులు లాంటివి ఉన్నాయి. మేము హోటల్లో గడిపిన కొద్ది రోజుల్లోనే ఆమె పూర్తి పుస్తకం చదివేసింది. 12 ఏళ్ల అమ్మాయి అలా చేసేసరికి నేను ఆశ్చర్యపోయాను. సమయం గడిచేకొద్దీ ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది’ అని జూహీ చెప్పుకొచ్చారు.
‘అలాగే క్రికెట్ గురించి మాట్లాడితే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఆ సమయంలో చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. దీంతో క్రికెట్ విషయాలపై ఆమెకున్న పరిజ్ఞానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసేది. ఇక మూడేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో తొలిసారి పాల్గొని.. ఈ అవకాశం దక్కించుకున్న పిన్న వయస్కురాలిగా నిలిచింది. అప్పుడు ఆమెకు 17 ఏళ్లే. ఇక గతేడాది ఆర్యన్, జాహ్నవి వేలానికి హాజరవ్వగా ఈసారి సుహానా వారితో చేరింది. మా సీఈవో వెంకీ మైసూర్ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. జాహ్నవీని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనడానికి, ఆమె అభిప్రాయాలు బలంగా వినిపించడానికి బాగా ప్రోత్సహిస్తారు. ఆయన నా కూతుర్ని ప్రేమగా 'కోచ్' అని పిలుస్తాడు. నిజానికి ఆమె ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ శిబిరంలో యువ ఇంటర్న్‌గా శిక్షణ పొందుతోంది. ఒక తల్లిగా నా కూతుర్ని చూసి సంతోషంగా ఉండటంతో పాటు గర్వంగానూ ఫీల్ అవుతున్నా. ఆమె చాలా తెలివైనది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. దేవుడి దయ వల్ల ఆమెకు నచ్చిన మార్గంలోనే పయనిస్తోంది’ అని జూహీ భావోద్వేగభరితమైన పోస్టు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
-
Business News
Crypto crash: క్రిప్టో క్రాష్.. ఇంకా ఎంత దూరం?
-
Movies News
Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
-
Ts-top-news News
JNTUH: ఆన్లైన్లో చదువుకో.. నైపుణ్యం పెంచుకో: జేఎన్టీయూహెచ్లో సర్టిఫికెట్ కోర్సులు
-
Ts-top-news News
Hyderabad News: తెలంగాణ వంటలు రుచి చూపిస్తాం: హైటెక్స్‌కు యాదమ్మ
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు