IPL 2023: టోర్నీలోని మిగతా మ్యాచుల్లో కేన్ విలియమ్సన్ ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

స్టార్‌ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌లోని (IPL 2023) మిగతా సీజన్‌ నుంచి వైదొలిగాడు. చెన్నైతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ టైటాన్స్‌ (GT) ప్రకటన విడుదల చేసింది.

Published : 02 Apr 2023 13:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది ఛాంపియన్‌గా నిలిచి ఐపీఎల్‌ (IPL 2023) 16వ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన గుజరాత్‌ టైటాన్స్‌కు (GT) షాక్ తగిలింది. మినీ వేలంలో కొనుగోలు చేసిన కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా మిగతా టోర్నీకి దూరమవుతున్నట్లు గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం ప్రకటించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు కేన్‌ కాలికి గాయమైంది. దీంతో బ్యాటింగ్‌కు రాకపోవడంతో అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంపిక చేసుకుని బ్యాటింగ్‌ ఆడించింది. ఇప్పుడు  వైద్య పరీక్షల అనంతరం  గాయంపై గుజరాత్‌ కీలక ప్రకటన చేసింది. 

‘‘టాటా ఐపీఎల్‌ 2023 సీజన్‌కు కేన్‌ విలియమ్సన్‌ దూరమవుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడటంతో అతడికి విశ్రాంతి అవసరమని వైద్యబృందం తెలిపింది. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’’అని గుజరాత్‌ టైటాన్స్‌ పేర్కొంది.  మినీ వేలంలో కేన్‌ను గుజరాత్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. గతేడాది వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నాయకత్వం వహించిన కేన్‌ను ఈసారి గుజరాత్‌ సొంతం చేసుకుంది. మిడిలార్డర్‌లో కీలకమవుతాడని భావించినప్పటికీ గాయం కారణంగా వైదొలగడం గుజరాత్‌కు షాకింగ్‌లాంటి నిర్ణయమవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని