Published : 24 Jun 2021 11:29 IST

WTC Final: కోహ్లీ కౌగిలిలో వినమ్రంగా కేన్‌.. వైరల్‌

వాహ్‌.. ఏం చిత్రమిది! అంటూ కామెంట్స్‌

ఒక చిత్రం వెయ్యి మాటల పెట్టు! నోటితో చెప్పలేని ఎన్నో మాటలను.. చూపులతో వ్యక్తీకరించలేని ఎన్నో భావోద్వేగాలను ఒక చిత్రం స్పష్టంగా చూపించగలదు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక విరాట్‌ కోహ్లీ.. కేన్‌ విలియమ్సన్‌ను హత్తుకోవడం ఇలాంటిదే. ఓటమి బాధలో ఉన్న విరాట్‌ కౌగిలిలో కేన్‌ స్నేహపూర్వకంగా విన్రమంగా ఒదిగిపోయాడు. ఆ అద్భుత క్షణంలో బంధించిన చిత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కేన్‌ విలియమ్సన్‌, విరాట్‌ కోహ్లీ అండర్‌-19 నుంచి మంచి స్నేహితులు. వేర్వేరు జట్లకు ఆడుతున్నా.. ప్రత్యర్థులుగా మైదానంలో తలపడుతున్నా.. వారి మిత్రబంధం మాత్రం మరింత బలపడుతూనే ఉంది. పరస్పరం గౌరవించుకోవడం.. మాట్లాడుకోవడం.. ముచ్చట్లు చెపుతూ నవ్వుకోవడం.. అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాంటి చిత్రాలు చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజా చిత్రం మాత్రం అంతకు మించే అనాలి. ఇద్దరూ కొన్నేళ్లుగా సొంత జట్లకు సారథ్యం వహిస్తున్నారు. ఆరంభంలో కాస్త ఇబ్బందులున్నా క్రమంగా జట్లపై బలమైన ముద్ర వేశారు. కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటేందుకే ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథులే అయినా ఐసీసీ టోర్నీల్లో ఆఖరి మెట్లపై బోల్తా పడటం వారికో ఇబ్బందిగా మారింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీసేన ఫైనల్లో పాక్‌ చేతిలో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్‌ చేతిలో ఓటమి చవిచూసింది. అటు కివీస్‌ సైతం ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్‌ గెలవలేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీ మినహాయిస్తే వారి స్థాయికి తగిన టైటిల్‌ మాత్రం కొట్టేలేదు. 2015, 2019 ప్రపంచకప్‌ ఫైనళ్లలో ఓటమి పాలైంది.

అందుకే ఈ ఇద్దరు సారథులకు ఐసీసీ ప్రపంచటెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కీలకంగా మారింది. వర్షం వల్ల వాతావరణం బాగా లేకపోవడంతో చివరి రోజు వరకు ఫైనల్‌ డ్రా అవుతుందనే అనుకున్నారు. కానీ, రిజర్వు డే అయిన మంగళవారం మాత్రం అనూహ్యం జరిగింది. కోహ్లీసేనను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన న్యూజిలాండ్‌ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఇద్దరికీ దక్కుతుందనుకున్న ఐసీసీ గద విలియమ్సన్‌ భుజాలపైకి చేరింది. అలాంటి క్షణాల్లో కోహ్లీ కౌగిలిలో వినమ్రతతో ఒదిగిపోయిన కేన్‌ చిత్రం వైరల్‌ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని