
Kane Williamson : కీలక మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌కు షాక్..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో కీలకమైన మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. కేన్ సతీమణి సారా రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో బయోబబుల్‌ను వదిలి న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా ట్విటర్‌లో ప్రకటించింది. ‘‘మా జట్టు సారథి కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌కు బయలుదేరాడు. కుటుంబంతో గడిపాల్సిన అత్యవసర సమయం ఇది. అతడి భార్య రెండో బిడ్డకు జన్మినవ్వనుంది. దీంతో సతీమణి పక్కన ఉండేందుకు కేన్ బయోబబుల్‌ను వదిలిపెట్టాడు. సురక్షిత ప్రసవం జరగాలని, కేన్ కుటుంబంలో ఆనందం నిండాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది.
గత రాత్రి ముంబయిపై 3 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. తన ఆఖరి మ్యాచ్‌లోనూ పంజాబ్‌పై గెలిచి.. ఇతర జట్లు ఓడితే ప్లేఆఫ్స్ బెర్తు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే పంజాబ్‌పై ఘన విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. అయితే జట్టును నడిపించే కేన్ విలియమ్సన్ దూరమైన క్రమంలో హైదరాబాద్ ఎలా ఆడుతుందో వేచి చూడాలి. కేన్ గైర్హాజరీలో హైదరాబాద్‌ను భువనేశ్వర్ కుమార్ లేదా నికోలస్ పూరన్ నడిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంజాబ్‌తో మే 22న హైదరాబాద్ తలపడనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anthrax: కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. మృత్యువాతపడుతున్న అడవి పందులు!
-
General News
ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఏమయ్యాయంటే?..పిట్ట కథలు చెబుతున్నారు: సూర్యనారాయణ
-
World News
Putin: ‘నాటోలో ఆ రెండు దేశాల చేరికపై మాకేం సమస్య లేదు. కానీ..’ పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Business News
Stock Market: మదుపర్ల అప్రమత్తత.. మార్కెట్ల ఊగిసలాట
-
Politics News
Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
-
Business News
Ease of doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు టాప్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?